- Advertisement -
గుజరాత్‌లోని GIR జాతీయ వన్యప్రాణుల అభయారణ్యం సందర్శన అద్భుతమైన అనుభవం అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణం,అటవీ,వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా జైరామ్ రమేష్ అధ్యక్షతన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గుజరాత్‌లోని GIR నేషనల్ పార్క్‌ను సందర్శించారు.
నేషనల్ పార్క్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సింహం ఫోటోలను ఎంపీ సంతోష్ కుమార్ తన కెమెరాలో బంధించారు. నేషనల్ పార్క్ సందర్శనలో మంత్రముగ్ధులను చేసే ఎన్నో జ్ఞాపకాలు కలిగి ఉన్నాయి వాటి జ్ఞాపకార్థం తీసిన అద్భుతమైన చిత్రాలు ఇవి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఎంపీ సంతోష్ కుమార్.
- Advertisement -