- Advertisement -
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి బండి సంజయ్‌ని కలిసిన కొండా…పార్టీలో చేరికకు సుముఖంగా ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 14న బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతుండగా ఆయన సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం.
జితేందర్‌రెడ్డితో మహబూబ్‌నగర్‌లోని ఆయన నివాసంలో రెండు గంటల పాటు సమావేశమయ్యారు కొండా. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలు, బీజేపీలో చేరితే ఏం చేయాలనే దానిపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.
భేటీ అనంతరం కొండా మాట్లాడుతూ నా చేరిక బీజేపీ చేతల మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. మొత్తంగా కొండా బీజేపీలో చేరుతారనే వార్త రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -