- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతి సందర్బంగా దాసరి స్మృతివనం మొయినాబాద్లో దాసరి నారాయణరావు-పద్మ మెమోరియల్ నీడ చారిటబుల్ ట్రస్ట్, దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య నిర్వాహకులు మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు కూతురు హేమ, అల్లుడు డా.రఘునాధ్ బాబు, మనవళ్లు ధనూష్ ,గగన్, దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు గుమ్మా నరేష్,కార్యదర్శి టీ.నరసింహారావు, చలనచిత్ర దర్శకులు రాజావన్నెం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -