టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరంతా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సత్యం యాదవ్, కొయిల్ కొండ మండలం రాంపూర్ గ్రామ గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షులు జి పెద్ద రాములు నేతృత్వంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 300 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ ముఖ్య కార్యకర్తలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
బీజేపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో యాదవ సంఘం ముఖ్య నాయకులు ఎల్. శ్రీనివాస్ యాదవ్, రాఘవేందర్ యాదవ్, బి. శ్రీనివాస్ యాదవ్, రవికుమార్ యాదవ్, పి. సాయితేజ యాదవ్, అఖిలేష్ యాదవ్, పవన్ కుమార్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, విగ్నేష్ యాదవ్, సాయికిరణ్ యాదవ్, అభిషేక్ యాదవ్ తదితరులు ఉన్నారు.