నేను కార్మికుడినే: చిరంజీవి

63
chiru
- Advertisement -

తాను కార్మికుడినేనని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. అయితే.. బయటి కార్మికులకు, సినీ కార్మికులకు చాలా తేడా ఉంటుంది. బయటి కార్మికులకు నిర్ణీతమైన సమయం, వాతావరణం ఉంటుంది. సినీ కార్మికులకు నిర్ణీతమైన సమయం అంటూ ఉండదన్నారు.

మేడే సందర్భంగా చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు…సినీ కార్మికులందరు చేసుకుంటున్న పండుగకు నన్ను ఆహ్వానించిన ఫెడరేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు కోసం నేను అమెరికా పర్యటన వాయిదా వేసుకుని వచ్చానని చెప్పారు.

ఎన్నో బాధలను దిగమింగుకొని సినిమా కోసం కార్మికులు పనిచేస్తారు. సినీ కార్మికుల జీవితాలకు ఇక్కడ భరోసా లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులంతా ఐక్యంగా ఉండాలన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక మాట, ఒక పిలుపుతో స్పందించిన తీరు కానీ అందించిన చేయూత కానీ నభూతో నభవిష్యతి అన్నారు చిరు.

- Advertisement -