టాలీవుడ్ సీనియర్ హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆచార్యతో ప్రేక్షకుల ముందుకువచ్చిన మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన బాలకృష్ణ..అఖండ సినిమాతో ఆచార్య సినిమాను పోలుస్తున్నారు సినీ విశ్లేషకులు.
అయితే ఈ రెండు సినిమాల కథ ఒక్కటే. ధర్మాన్ని కాపాడటం. బాలయ్య నటించిన అఖండ సినిమాలో అఘోర పాత్ర పోషించగా ఆచార్యలో చిరంజీవి నక్సలైట్ పాత్రను పోషించారు.ఈ రెండు సినిమాలు కూడా దాదాపు ఒకేసారి షూటింగ్ ని పూర్తి చేసుకోగా అఖండ మాత్రం ముందుగా విడుదలై సక్సెస్‌ని అందుకుంది. ఆచార్య మాత్రం మిక్స్‌డ్ టాక్‌తో వెనుకబడింది.
అఖండ సినిమాలో బాలకృష్ణ మైనింగ్ మాఫియా చేసేవాళ్ళని అంతమొందించి ధర్మాన్ని కాపాడతాడు. ఆచార్య సినిమాలో కూడా చిరంజీవి మైనింగ్ మాఫియాని అంతం చేసి ధర్మాన్ని కాపాడతాడు. ఇక ఈ రెండు సినిమాల్లోనూ మెయిన్ క్యారెక్టర్స్ కి హీరోయిన్ లేదు.
ఆర్‌ఆర్‌ఆర్‌తో విజయం సాధించిన చరణ్ తన తండ్రితో కలిసి ఆచార్య అనే అపజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇక ఇప్పటివరకు ఫ్లాప్ ఎరుగని దర్శకుడు కొరటాల శివ…మెగా ఫ్లాప్‌తో మెగాస్టార్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.