రాష్ట్రంలో భానుడి భగ భగలు..

58
- Advertisement -

తెలంగాణలో ఎండ తీవ్రత రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం పూట జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండవేడిమి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. నిన్న‌ ఆదిలాబాద్‌ జిల్లాలోని జైసద్‌లో అత్య‌ధికంగా 45.7 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అలాగే, జగిత్యాలలోని ఐలాపూర్ లో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ఈరోజు, రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపారు. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓవైపు ఎండ‌లు మండిపోతుండ‌గా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ‌ర్షాలు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావ‌ర‌ణ శాఖ‌ అధికారులు పేర్కొన్నారు. ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కూడా ప‌డే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించారు.

- Advertisement -