టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి షాక్ తగిలింది. సీఐను అసభ్య పదజాలంతో దూషించడంతో తాండూరు పీఎస్‌లో మహేందర్ రెడ్డిపై 353, 504,506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు..
గత కొన్ని రోజులుగా తాండూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా రథోత్సవం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
దీంతో తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా? రా లం… కొడకా..! నీ అంతు చూస్తా..! అంటూ వార్నింగ్ ఇచ్చారు మహేందర్ రెడ్డి. పద్ధతిగా మాట్లాడాలని సీఐ వారిస్తుంటే.. రికార్డు చేసుకో.. మీడియాకు ఇచ్చుకో.. నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే రౌడీషీటరా? అని సీఐ ప్రశ్నించగా.. వాడి పక్కన రౌడీషీటర్లు లేరారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మహేందర్ రెడ్డిపై కేసు నమోదుచేశారు పోలీసులు.