మరో 5 రెడీ అవుతున్నాయి.. చిరు షాకింగ్ కామెంట్స్..

59
chiru
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి – చరణ్ కథానాయకులుగా కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను రూపొందించాడు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు మూడు రోజులే ఉండడంతో ప్రమోషన్స్‌ జోరు పెంచేసింది మూవీ యూనిట్‌. సినిమా ప్రచారంలో భాగంగా ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న చిరు ఆసక్తికర విషయాలు చెప్పారు.ఈ వయసులో మీరు ఇంత ఉత్సాహంగా ఎలా పనిచేయ గలుగుతున్నారు? అనే ప్రశ్న ఎదురైంది. దానికి చిరు షాకింగ్‌ సమాధానం ఇచ్చారు.

ఇప్పుడు నాచేతిలో ఐదు సినిమాలున్నాయని అనుకుంటున్నారు. మరో ఐదు కథలు కూడా రెడీ అవుతున్నాయి. ఇటీవల ‘గాడ్‌ఫాదర్’ సినిమా షూటింగ్‌ను రాత్రివేళల్లో చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బాబీ చిత్రానికి కూడా నైట్‌టైమ్ లోనే పనిచేయాల్సి వచ్చింది. అయినా నేను అలసటగా ఫీలవలేదు. మరింత ఉత్సాహంగా పనిచేశాను. ఎంతో పుణ్యం చేయడం వల్లనే నేను సినిమాల్లోకి వచ్చానని అనుకుంటూ ఉంటాను. ఇక్కడ వచ్చిన క్రేజ్‌ను నిలబెట్టుకోడానికి ఎప్పుడూ కష్టపడుతునే ఉండాలి. అలా నేను పడే కష్టమే నన్ను మరింత ఆరోగ్యవంతుణ్ణి చేసి ముందుకు నడిపిస్తోంది.. అంటూ చిరు చెప్పుకొచ్చారు.

- Advertisement -