కులమతాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు- సీఎం

43
kcr speech
- Advertisement -

మతం క్యాన్సర్ కంటే ప్రమాదమన్నారు సీఎం కేసీఆర్‌. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లో టిమ్స్‌ ఆసుపత్రులకు భూమిపూజ చేశారు. అనంతరం అల్వాల్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాలను ఆదరించే దేశం మనదని, శాంతిభద్రతలు బాగుంటే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు సీఎం కేసీఆర్‌. కులం, మతం పేరుతో గొడవలు జరిగితే ఎవరూ రారని, గొడవ పడితే మన కాళ్లు మనమే నరుక్కున్నట్లు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వైద్య విధానాన్ని పటిష్టం చేసేందుకు పేదలకు వైద్యం అందించేందుకు పూస కుచినట్టు హరీష్ రావు చెప్పారని, పేదలు పాపం వైద్యం కోసం వస్తే దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోతారు అయితే పేదలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తాము చూశామని.. నిలోఫర్ హాస్పిటల్ లో ఓక్కరు చనిపోతే శవాన్ని తీసుకుకొని పోవడానికి డబ్బులు లేవు అని వార్త వచ్చిందని, వెంటనే సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి 50 అంబులెన్స్ లు ఏర్పాటు చేయమని చెప్పానని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ఇలా అంబులెన్స్ లు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేవని, నగరం మీద లోడ్ ఎక్కువతుంది కాబట్టి 4 హాస్పిటల్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. భవిష్యత్‌లో కరోనాలాంటి మహమ్మారి వైరస్‌లు వస్తాయని నిపుణులు చెప్పారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మరి ఏం చేయాలంటే ఒక రాష్ట్రం గానీ, దేశం గానీ, ఒక నగరం గానీ ఎవరికైతే పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటదో వారు తక్కువ నష్టంతో బయటపడుతారనీ, వ్యవస్థ బాగా ఉండదో వాళ్లు నష్టాలకు గురై లక్షల మంది చనిపోతారని చెప్పారన్నారు. వైరస్‌లను మొత్తం మెకానిజం ప్రపంచంలో లేదని, కంట్రోల్‌ చేసే వైద్య విధానం ఉందన్నారు. వైద్య విధానాన్ని పటిష్టం చేసే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మానవీయకోణంతో చాలా కష్టపడి.. పోరాడి.. ఆరుదశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి.. దీన్ని అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో పటిష్ట పరిచేందుకు సరైన పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు సీఎం.

ఈ రోజు మిగతా పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతున్నాయి, మనం మాత్రం కంటోన్మెంట్‌ సికింద్రాబాద్‌లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఎవరు చనిపోయినా వారింటికి తీసుకెళ్లేలా వాహనాలు ఏర్పాటు చేశామని, 50, 60 వాహనాలను ఏర్పాటు చేయాలని సీఎస్‌కు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య విధానాన్ని పటిష్ట పరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, పేదరకం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కాకూడదని, హెచ్‌ఎండీఏ పరిధిలో 1.64కోట్ల జనాభా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. గాంధీ, ఉసాన్మియా కాకుండా మరో నాలుగు ఆసుపత్రులు ఉండాలని నిర్ణయించామని, అన్ని రకాల వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు ప్రజలకు అందుతాయన్నారు. అల్వాలలో మహిళల ప్రసూతి వింగ్‌ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

- Advertisement -