ఉక్రెయిన్‌ పై రష్యా దాడి..26 స్థావరాలు ధ్వంసం

68
ukraine
- Advertisement -

రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 423 లక్ష్యాలపై దాడి చేసినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ లో 26 స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా వెల్లడించింది. రైల్వే వ్యవస్థ, ఇంధన నిల్వలు, మౌలిక వసతులపై రష్యా బాంబులు వేసింది.

పోర్టు నగరం ఒడెస్సాలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలపై రష్యా సేనలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. రష్యా దాడుల్లో సామాన్య పౌరులు మృత్యువాతపడుతున్నారు. ఇళ్లను వదిలి ఎక్కడికి వెళ్లాలంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరియుపోల్‌లోని అజోవ్ స్టీల్‌ ప్లాంట్‌లో చిక్కుకుపోయిన యుక్రెయిన్‌ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది. స్టీల్‌ ప్లాంట్‌ను కైవసం చేసుకునేందుకు రష్యా సేనలు ఎయిర్‌ స్ట్రైక్స్‌ చేస్తున్నాయి.

- Advertisement -