ఈ నెల 27న జరగబోయే టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లకు సర్వం సిద్ధం అవుతోంది. గులాబీ పండుగ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ ప్లెక్సీలు, టీఆర్ఎస్ జెండాలు దర్శనమిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో సైతం టిఆర్ఎస్ పార్టీ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు తెలంగాణ సాయి. ఈ ప్లెక్సీలపై దేశ్ కా నేత సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. ‘నాడు’ మూడున్నర కోట్ల ప్రజల స్వప్నమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, “నేడు” అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ…తెలంగాణ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ముందుకువెళ్తున్నది మన టీఆర్ఎస్ పార్టీ. జాతీయ స్థాయిలో బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా సీఎం కేసీఆర్ నిలవాలని ఆశిస్తు బీజేపీ పాలిత రాష్ట్రల్లో ఫ్లెక్సీ లు ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది.
దేశంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. రైతు బంధు, రైతు భీమా,వ్యవసాయ రంగం కు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో సీఎంలను కలిసి డిమాండ్ చేస్తున్నారు ఆయా రాష్ట్రాల ప్రజలు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆయా రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.