- Advertisement -
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమాను భూషణ్ కుమార్ (టీ సిరీస్), ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతి హాసన్ నటిస్తున్నారు.
తాజాగా సినిమాకు సంబంధించి కీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం ఓ లోయలో జరుగుతుందని.. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. లోయ లోపల చేసే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందట. .
ఇక ప్రీ క్లైమాక్స్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టారట. హాలీవుడ్ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని తెలుస్తోంది.
- Advertisement -