- Advertisement -
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులుతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు..తిరుమలలో క్యూ లైన్ల వద్ద భక్తుల సౌకర్యార్ధం..ఫ్యాన్లు, కూలర్లు, కూలింగ్ టెంట్లు, చల్లటి త్రాగు నీరు అందించనున్నారు.
ఏయే సమయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందో అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని, భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలని మంత్రి కొట్టు సత్యనారాయణ టీటీడీ అధికారులను ఆదేశించారు.
- Advertisement -