- Advertisement -
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. విడుదలైన ప్రతి చోట భారీ వసూళ్లను రాబట్టిన ఆర్ఆర్ఆర్…ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసింది.
రెండు వేల కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఆర్ఆర్ఆర్.. త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. జీ-5, నెట్ ప్లిక్స్ ద్వారా ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. జూన్ 3 నుంచి అన్ని భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుందట. డిజిటల్ రిలీజ్ పై ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ మేకర్స్ నుండి అధికారిక క్లారిటీ లేదు కానీ త్వరలోనే స్ట్రీమింగ్ పై ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.
- Advertisement -