భారత్‌కు బ్రిటన్ ప్రధాని..

97
modi
- Advertisement -

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ భారత్‌కు రానున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. కరోనా ప్రభావం తగ్గడంతో లండన్‌ నుండి నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ పారిశ్రామిక, వ్యాపారవేత్తలో సమావేశమవుతారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా భారత్‌- బ్రిటన్‌ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నది.

ఇక రెండోరోజు శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రక్షణ, వాణిజ్య బంధాలు, ఆర్థిక వృద్ధి, ఇంధ‌న భ‌ద్రత‌ సహా పలు అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవశకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా బోరిస్‌ జాన్సన్‌ గతేడాది రెండుసార్లు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.

- Advertisement -