వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ చిత్రం జూన్ 10న విడుదలకు సిద్ధమైయింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ జోరుగా ప్రొమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ రోజు టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్, నాని, నజ్రియా ఇది డ్రీం కాంబినేషన్. నాని, నజ్రియా నటన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. మీరంతా చూస్తారు.
నా టీమ్ అందరికీ థ్యాంక్స్. స్క్రిప్ట్ రాసినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను. రాసింది రాసినట్లు వస్తే బావుండని అనుకున్నాను. కానీ నా టీమ్ నేను రాసింది, ఊహించినదాని కంటే పదిరెట్లు అద్భుతంగా చేశారు. సినిమాటోగ్రఫర్ నికిత్, సంగీత దర్శకుడు వివేక్, ఎడిటర్ రవితేజ, లతా, వరుణ్, పల్లవి.. టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. డైరెక్షన్ టీం ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా తెలియకుండా ఈ సినిమా కోసం పని చేశారు. సచ్విన్, దినేష్, రాధ గారు,అనిల్, విద్య, కీర్తి, విక్కీ, విజయ్.. అందరికీ థ్యాంక్స్. చివరిగా నజిరియా.. వెల్కమ్ టు తెలుగు సినిమా” అని అన్నారు వివేక్.