పాన్ ఇండియా మూవీలో నిఖిల్!

39
spy
- Advertisement -

వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో నిఖిల్. ఇప్పటికే నిఖిల్ చేతిలో 18 పేజెస్, కార్తికేయ 2 చిత్రాలు ఉండగా తాజాగా ఓ పాన్ ఇండియా చిత్రానికి సంతకం చేశారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.నిఖిల్ కెరీర్‌లో ఇది 19వ చిత్రం.

ఈ చిత్రానికి ‘స్పై’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిఖిల్ చేతిలో షాట్‌గన్‌ పట్టుకుని, సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోండగా అభినవ్ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -