శాకుంతలం అప్‌డేట్ ఇచ్చిన సామ్!

59
samantha
- Advertisement -

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల‌లో పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక‌ల్ సినిమాగా తెరకెక్కుతోంది. దేవ్ మోహ‌న్ ఇందులో దుష్యంతుడు పాత్ర పోషించగా అల్లు అర్జున్ కూతురు అర్హ కీ రోల్ పోషించారు. మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల మరియు వర్షిణి సౌందరరాజన్ తదితరులు ఈ చిత్ర తారాగణంలో భాగం కానున్నారు. గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే తాజాగా డబ్బింగ్ పూర్తి చేశానంటూ వెల్లడించింది సమంత. రాజు దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. మణి శర్మ సంగీతం అందించనున్నారు.

ఈ సినిమాతో పాటు సామ్ ఖాతాలో యశోద, సిటాడెల్, అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ వంటి చిత్రాలు ఉన్నాయి.

- Advertisement -