కాటమరాయుడిని దాటేసిన దువ్వాడ జగన్నాధం..!

299
DJ record in youtube
DJ record in youtube
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రం `డి.జె…దువ్వాడ జగన్నాథమ్`. పూర్తి భక్తి కంటెంట్‌తో ఉన్న ఈ టీజర్‌లో అల్లు అర్జున్ ఇంతకు ముందెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్‌తో అదరగొడుతున్నాడు. నుదిటిన నామాలు పెట్టుకుంటూ.. తెల్లటి వస్త్రాలు, పాత మోడల్ బజాజ్ చేతక్ బండిపై కూరగాయాలను పెట్టుకుని వస్తోన్న పంతులుగారు ‘డీజే’ టీజర్‌తో అదరగొట్టేశాడు.

ఇక అందరూ బాహుబలిః ది కంక్లూజన్ ట్రైలర్ రికార్డుల గురించి చర్చించుకుంటున్న తరుణంలో బన్నీ డీజే టీజర్‌ సైలెంట్‌గా యూట్యూబ్ లో రికార్డు కొట్టేసింది. పవన్ టీజర్ 10 మిలియన్ వ్యూస్ పూర్తి చేసుకోవడానికి నెలకు పైగా సమయం తీసుకోగా.. ‘డీజే’ టీజర్ 24వ రోజుకే.. సరిగ్గా 555 గంటల్లో ఈ మైలురాయిని దాటింది. కొన్ని రోజుల కిందటే కోటి వ్యూస్ పూర్తి చేసుకున్న తొలి టాలీవుడ్ టీజర్ గా ‘కాటమరాయుడు’ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఐతే ‘కాటమరాయుడు’ తర్వాత వచ్చిన ‘డీజే’ టీజర్.. దాని కంటే వేగంగా దూసుకెళ్లింది.

imgpooja-hegde-allu-arjun

ఈ టీజర్ కు ఇప్పటిదాకా 1.75 లక్షల లైక్స్ రాగా… 1.6 లక్షల డిస్‌ లైక్స్ పడ్డాయి. ఈ టీజర్ విడుదలైనప్పటి నుండి బన్నీ యాంటీ ఫ్యాన్స్ అదే పనిగా డిస్‌ లైక్స్ కొట్టడం వివాదాస్పదమైందో తెలిసిన సంగతే. కేవలం 5 గంటల 12 నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ పూర్తి చేసుకున్న ‘డీజే’ టీజర్.. 5 మిలియన్ వ్యూస్ మార్కును 76 గంటల్లో అందుకుంది.

- Advertisement -