రాష్ట్రంలో కొత్తగా పది లక్షల పింఛన్లు ఇవ్వబోతున్నామని చెప్పారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి, అభయహస్తం కార్పస్ ఫండ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల క్రితం రూ.500 పింఛన్ కోసం కట్టారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రూ.200 పింఛను రూ.2016 ఇస్తున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా రూ.545 కోట్లు తిరిగి ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైందన్నారు.అభయహస్తం డబ్బులు వడ్డీతో కలిపి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా బ్యాంక్ లింకేజీ తెలంగాణలోనే నంబర్ వన్ అన్నారు. కల్యాణలక్ష్మితో పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఖర్చులు చేస్తున్నారన్నారు. ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి సురక్షితమైన తాగునీటిని అందించిన ఘనత కేసీఆదే అన్నారు.
దేశమంతటా కరెంటు కోతలున్నాయని, కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రూ.400 ఉన్న సిలిండర్ ఇప్పుడు రూ.1050 అయ్యిందన్నారు.