ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ కేజీఎఫ్ 2. కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. ఇంతకు ముందు ఏ కన్నడ హీరోకు లభించని ఆదరణ ఉత్తరాదిన యశ్ కు ఈ సినిమా ద్వారా లభించగా కేజీఎఫ్2తో యశ్ ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం…
కథ:
బంగారు గనుల్లోపనిచేసే కార్మికులను హింసించి, వారి ప్రాణాలను పూచిక పుల్లలా భావించేవారి అంతు చూస్తాడు. తరువాత ఆ గనుల యజమాని గరుడనే అంతమొందిస్తాడు రాకీ. అప్పటినుండి కథ మొదలుకాగా కేజీఎఫ్‌ని ఏలుతాడు రాకీ. అయితే రాకీకి అధీర రూపంలో కొత్త సవాలు ఎదురవుతుంది. ఈ క్రమంలో కేజీఎఫ్‌ను విడిచిపెడతాడు రాకీ. ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రమేయంతో కూడిన రాజకీయంతో కేజీఎఫ్‌ను విడిచిపెట్టిన రాకీ తర్వాత ఏం చేశౄడు…చివరికి కేజీఎఫ్‌ని దక్కించుకున్నాడా లేదా చూద్దాం..
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ యశ్,సీక్వెల్,ప్రశాంత్ నీల్ దర్శకత్వం, సినిమాటోగ్రఫీ. రాకీ తనపాత్రకు వందశాతం న్యాయం చేశారు. ఇక సినిమాకు ప్రత్యేక ఆకర్షణ సంజయ్ దత్. అధీర పాత్రలో సంజయ్ జీవించారు. రాకీ, అధీరాకు మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు గూస్ బంప్స్ కలిగిస్తాయి. హీరోయిన్ శ్రీనిధి శెట్టికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. రా ప్రధానిగా రవీనా టాండన్, సీబీఐ ఆఫీసర్ గా రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీరోల్ పోషించారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథను సాగదీయడం,ఓవర్ గా యాక్షన్ సీన్స్. కథ కేజీఎఫ్ దాటి దుబాయ్ వెళ్ళడం వరకూ ఓకే కానీ, రాజకీయ రంగు పులిమి భారత పార్లమెంట్ కు తీసుకెళ్ళడం కాస్తంత అతిగానే అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. మొదటి భాగంలాగే ఈ సినిమాకూ సినిమాటోగ్రఫీయే ప్రాణం. కథకు అనుగుణమైన కెమెరా పనితనం చూపించి, అడుగడుగునా ఆకట్టుకున్నారు. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన కేజీఎఫ్ 2తో ప్రశాంత్ నీల్ మరోసారి ఆకట్టుకున్నాడు. తాను చెప్పదలచుకున్న అంశాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో సక్సెస్ అయ్యారు. రెండు భాగాలనే మూవీ మేకర్స్ గతంలో ప్రకటించినా ఇప్పుడు మరో భాగం ఉంటుందనే ఆశనైతే ప్రేక్షకులకు కలిగించారు. ఓవరాల్‌గా అంతాచూడదగ్గ చిత్రం కేజీఎఫ్ 2.
విడుదల తేదీ:14/04/2022
రేటింగ్:2.75/5
నటీనటులు : యశ్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్
సంగీతం: రవి బస్రూర్
నిర్మాత: విజయ్ కిరగండూర్
దర్శకత్వం: ప్రశాంత్ నీల్