పాక్ ప్రధానికి మోదీ విషెస్

142
modi
- Advertisement -

పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. భారత్ దేశం ఎల్లప్పటికీ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుందని, దేశం అభివృధ్ధి చెందే దిశలో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందన్నారు. భారతదేశం శాంతి కాముక దేశమని, ఉగ్రవాదం లేని ప్రాంతంలో మనం అభివృద్ధి సవాళ్లపై దృష్టి సారించవచ్చన్నారు. ఇది మన ప్రజలకు ఎంతో శ్రేయస్కరమని తెలిపారు.

అవిశ్వాస తీర్మానంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇమ్రాన్‌ఖాన్ వ్యతిరేక కూటమిలోని ప్రతిపక్షాలన్నీ పాకిస్థాన్ ప్రధానిగా పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్‌ను ప్రతిపాదించడంతో నూతన ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎన్నిక లాంఛనమైంది.

- Advertisement -