రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు సిగ్గుండాలి- కేసీఆర్

103
CM KCR Slams Bandi
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు సిగ్గుండాలి అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. సోమవారం ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాతూ తెలంగాణ బీజేపీ నేతలపై మండిపడ్డారు. కేంద్రం పంట మార్పిడి చేయాల‌ని సూచించిన‌ట్లు తాము రైతుల‌కు చెప్పామ‌ని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగా రైతులు ధాన్యం పండించండి.. మేము కొంటామ‌ని కిష‌న్ రెడ్డి చెప్పారు.

రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా రైతుల‌ను రెచ్చ‌గొట్టాడు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల‌ని తాము ఢిల్లీలో ధ‌ర్నా చేస్తే.. పోటీగా బీజేపీ నేత‌లు హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేస్తున్నారు. అస‌లు వాళ్ల‌కు సిగ్గుండాల‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. ఏ ఉద్దేశంతో బీజేపీ నేతలు హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ నిస్సిగ్గుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. అంతిమ విజ‌యం సాధించేంత వ‌ర‌కు విశ్ర‌మించేది లేద‌ని కేసీఆర్ తేల్చిచెప్పారు.

- Advertisement -