ఎమ్మెల్యే పదవికి మేకతోటి సుచరిత రాజీనామా

139
sucharitha
- Advertisement -

ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వైసీపీలో చిచ్చు రాజేసింది. మంత్రి పదవి ఆశించి దక్కని వారు ఆవేదనతో రగిలిపోతుండగా మరికొంతమంది బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కనున్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి ఆమె రాజీనామా చేశారు.

స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లెటర్ ను మోపిదేవి వెంకటరమణకు ఇచ్చారు. జగన్ మొదటి కేబినెట్ లో మేకతోటి సుచరిత హోంమంత్రిగా పని చేశారు. రెండోసారి కూడా తనకు మినిస్టర్ పదవి వస్తుందని ఆమె ఆశించారు.

తానేటి వనితతో పాటు నారాయణ స్వామి, పినిపె విశ్వరూప్,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆదిమూలపు సూరేశ్,బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇలా చాలామంది నేతలు అసంతృప్తితోనే ఉన్నారు. ఇప్పటికే వీరి అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. 25 మందితో ఏపీ నూతన మంత్రివర్గం సోమవారం ఉదయం కొలువుదీరనుంది. ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్‌ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

- Advertisement -