శనివారం బేగంపేటలోని హరిత ప్లాజాలో ఎక్సైజ్ శాఖ అధికారులు, పబ్‌ల యజమానులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పబ్‌లలో డ్రగ్స్, ఇతర అంశాలతో పాటు నిబంధనలపై చర్చించారు. హైదరాబాద్ నగరానికి చెడ్డ పేరు వచ్చేలా చేస్తే పబ్‌లను మూసివేస్తామని హెచ్చరించారు.
పబ్‌లు నిబంధనలు ఉల్లంఘిస్తే అబ్కారీ శాఖ అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి పబ్‌లో అన్ని వైపులా సీసీ కెమెరాలు ఉండాలని మంత్రి ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమిస్తే పీడీ చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు. నిజాయితీగా వ్యవహరిస్తేనే పబ్‌లకు అనుమతిస్తామన్నారు. పబ్‌లు, బార్‌లపై ఆకస్మిక తనిఖీలు ఉంటాయని.. నగరంలోని 61 పబ్‌లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
డ్రగ్స్, గంజాయిని డెలివరీ చేయొద్దని ఈ-కామర్స్ సంస్థలకు మంత్రి సూచించారు.సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చారని మంత్రి గుర్తు చేశారు. తొలిదశలో పేకాట క్లబ్‌లను మూసివేయించారు. ఇప్పుడు డ్రగ్స్, గంజాయి నిరోధించడమే ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు. డ్రగ్స్ వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని సీఎం ఆదేశించారని తెలిపారు. అందరిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలకు ఆదేశించారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.