- Advertisement -
హైదరాబాద్‌లో 2 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం శ్రీరామ నవమి పండుగ కావడంతో ఎక్సైజ్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు నగరంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు హెచ్చరించారు.
- Advertisement -