ఏపీలో పవర్ హాలీడేతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారానికి రెండు రోజుల పాటు పరిశ్రమలకు పవర్ హాలీడే ఇవ్వగా వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న టెకీలు తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారు.
చిన్నచిన్న పల్లెల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గంట కాదు, రెండు గంటల కాదు, కొన్ని చోట్ల ఏకంగా 6 నుంచి 12 గంటల పాటు పవర్ కట్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని…. పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ ఉన్నా కరెంట్ కోతలు సుదీర్ఘంగా ఉండటంతో ఫలితం లేకుండా పోతోంది. దీంతో ఏపీలోని టెకీలు హైదరాబాద్కు వస్తున్నారు. ఇక్కడ కరెంట్ కోతలు లేకపోవడంతో హైదరాబాద్ వైపు మొగ్గుచూపుతున్నారు. సోషల్ మీడియాలో ఏపీ ఐటీ ఉద్యోగులు తమ బాధలను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు.