విల్‌స్మిత్‌కు షాక్‌…పదేళ్ల పాటు నిషేధం

56
oscar academy
- Advertisement -

చెంప దెబ్బ ఎఫెక్ట్…ఆస్కార్ విజేత విల్ స్మిత్‌కు షాకిచ్చింది ఆస్కార్ అకాడమీ. ఆస్కార్‌ అవార్డు వేడుకలలో పదేండ్లపాటు పాల్గొనకుండా నిషేధం విధించింది. శుక్రవారం సమావేశమైన అకాడమీ గవర్నర్ల బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో విల్ స్మిత్‌కు షాక్ తగలగా అకాడమీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని విల్‌ స్మిత్‌ స్పందించారు.

94వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ వేడుకల వ్యాఖ్యతగా వ్యవహరించిన కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ను విల్‌ స్మిత్‌ కొట్టిన విషయం తెలిసిందే. తన భార్యపై జోకులు వేయడంతో కోపంతో ఊగిపోయిన స్మిత్‌.. వేదికపైనే క్రిస్‌ రాక్‌ చెంప చెల్లుమనించారు. దీంతో స్మిత్‌పై చర్యలు తీసుకుంది అకాడమీ.

- Advertisement -