తెవాటియా మ్యాజిక్…గుజరాత్ గెలుపు

81
rahul
- Advertisement -

ఐపీఎల్‌లో అసలైన మజాను ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు. పంజాబ్‌తో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో గుజరాత్‌ విక్టరీ కొట్టింది. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సిన తరుణంలో రెండు సిక్స్‌లు బాది థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు రాహుల్ తెవాటియా. దీంతో గుజరాత్ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపొందింది.

పంజాబ్ విధించిన 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆరంభంలోనే ఓపెనర్ వేడ్ వికెట్లు కొల్పోయింది. అయితే క్రీజులోకి వచ్చిన సుదర్శన్‌తో శుభ్‌మన్ గిల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కొల్పోయాడు గిల్. 59 బంతుల్లో 11 ఫోర్లు,ఒక సిక్సర్‌తో 96 పరుగులు చేయగా హర్ధిక్ పాండ్యా 27 పరుగులు చేశాడు. ఇక చివరలో గెలుపుకోసం రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సిఉండగా తెవాటియా రెండు సిక్సర్లతో చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.

ఇక అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ (27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ధవన్‌ (35), జితేశ్‌ (23) ఫర్వాలేదనిపించారు. రషీద్‌కు మూడు, దర్శన్‌ నల్కండేకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గిల్‌ నిలిచాడు.

- Advertisement -