నా సర్వస్వం ఇతనే: సిరి

106
- Advertisement -

బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న నటి సిరి. శ్రీహన్‌తో ప్రేమలో ఉన్న సిరి…బిగ్ బాస్ లో తన చేష్టల ద్వారా వీరి లవ్‌కు బ్రేకప్ పడిందనే వార్తలు వెలువడుతుండగా అలాంటి వారికి క్లారిటీ ఇచ్చేసింది.

తాజాగా సిరి ఓ ఫోటో షేర్ చేసి పోస్ట్ చేసింది. ఓ పార్టీలో శ్రీహాన్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ప్రతి క్షణం నా మంచి, చెడు సమయాల్లో పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మర్గదర్శి, నా గార్డియన్‌, నా సర్వస్వం అన్ని ఇతనే. మై వన్‌ అండ్‌ ఓన్లీ శ్రీహాన్‌ అంటూ పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ని రోజుల నుంచి వీరి రిలేషన్ పై అనేక వార్తలు రాగా తాజాగా ఈ ఒక్క పోస్ట్ తో అన్నిటికి చెక్ పెట్టి క్లారిటీ ఇచ్చింది సిరి.

- Advertisement -