- Advertisement -
ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు గవర్నర్ తమిళి సై. తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను అమిత్ షాకు వివరించనున్నారు. అలాగే వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, రాజకీయ పరిణామాలపైనా షాతో చర్చించనున్నారు తమిళి సై.
సీఎం కేసీఆర్ సైతం ఢిల్లీలో పర్యటిస్తున్న తరుణంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీకి చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్..ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మంగళవారం సీఎం కేసీఆర్ కు ఢిల్లీలో దంత చికిత్స చేశారు. పంటి నొప్పి ఎక్కువగా ఉండడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.
- Advertisement -