ఢిల్లీలో రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఈ సారి ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు రాహుల్. స్ధానికంగా పనిచేసిన వారికే టికెట్లు ఇస్తామని…6 నెలల ముందుగానే టికెట్ ప్రకటిస్తామని వెల్లడించారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సునీల్ ని పరిచయం చేశారు రాహుల్ . తెలంగాణ, కర్ణాటక వ్యవహారాలు సునీల్ చూస్తారు అని చెప్పిన రాహుల్… సునీల్ వ్యూహకర్త కాదు..మన పార్టీ కార్యకర్త అని తెలిపారు. అంతా కలిసి పని చేయాలని…క్రమశిక్షణ ముఖ్యం..కలిసి మెలిసి పని చేయండి. సునీల్ రిపోర్ట్ కూడా అదే అని చెప్పారు రాహుల్.
త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని…..అప్పుడు మరింత మందిని కలిసి పార్టీ లైన్‌ని వెల్లడిస్తామన్నారు. పార్టీలో అందరూ కలిసి పని చేయాలని.. అభిప్రాయ భేదాలు పార్టీకి నష్టం అని ఈ సమావేశంలో నేతలంతా ఒక అభిప్రాయానికి వచ్చారు.