ధాన్యం కొనుగోలు…మండలకేంద్రాల్లో నిరసన దీక్షలు

66
errabelli
- Advertisement -

యాసంగిలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగింది టీఆర్ఎస్. అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టింది.

ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు కొనసాగిస్తున్నారు.రాయపర్తిలో నిరసన దీక్షను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వినూత్నంగా చేపట్టారు. ఎడ్ల బండిలో ర్యాలీగా తరలి వచ్చి టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. కేంద్రం వడ్లను కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని మంత్రి తెలిపారు.

సోమవారం మండల కేంద్రాల్లో దీక్షలతో మొదలయ్యే పోరాటం 11వ తేదీన ఢిల్లీలో నిర్వహించే దీక్షతో రణ నినాదం చేయనుంది.

- Advertisement -