ఉగాది కానుక….పెట్రో వాత

95
petrol
- Advertisement -

ఉగాది కానుకగా పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 80 పైసలు చొప్పున పెరుగగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.61 సెంచరీ దాటేయగా.. డీజిల్ ధర మాత్రం 93.87కు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.30 పెరుగగా డీజిల్ ధర రూ.102.43 పెరిగింది.

గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.118.20 ఉండగా, డీజిల్ ధర రూ.103.94 పెరగగా, ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.57 పెరిగింది. డీజిల్ ధర లీటర్ రూ. 101.79 పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.21 పెరగగా, డీజిల్ ధర రూ. 98.28కు పెరిగింది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.19 పెరగగా, డీజిల్ ధర రూ.97.02కు పెరిగింది. వడ్డించాయి. గడిచిన 12 రోజుల్లో 10 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

- Advertisement -