- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కవిత.. ఉద్యోగార్థులకు మాత్రం ఉద్యోగ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిని ఉద్యోగ నామ సంవత్సరంగానే పిలవాలంటూ కూడా ఆమె పిలుపునిచ్చారు. యువత ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీ శాట్‌ను సద్వినియోగం చేసుకోవాలని.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కవిత పిలుపునిచ్చారు.
- Advertisement -