- Advertisement -
ఆంధ్రప్రదేశ్ సర్కారు పలు ప్రజాసంక్షేమ పథకాలు తీసుకొస్తు ముందుకు దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. శుక్రవారం ‘వైయస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా 500 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చడం ఈ పథకం ముఖ్య ఉదేశం.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని… అక్కచెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గతంలో వాహనాలు అరకొరగా ఉండేవని, ఆసుపత్రుల్లో సరైన వసతులు కూడా ఉండేవి కాదని… వైసీపీ అధికారంలోకి వచ్చాక రూపురేఖలు మార్చేశామని చెప్పారు.
- Advertisement -