గ్యాస్ సిలిండర్ ధర రూ.273.5 పెంపు!

120
gas
- Advertisement -

నిత్యావసర వస్తువులు, పెట్రోల్,డీజీల్ ధరలతో పాటు గ్యాస్ ధరల పెంపు ఆగడం లేదు. వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌ ధరను భారీగా పెంచాయి చమురు కంపెనీలు. ఒకేసారి ఏకంగా రూ.273.5 పెంచడంతో హైదరాబాద్‌ కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.2460కి చేరాయి.

న్యూఢిల్లీలో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.250 పెరిగింది. దీంతో రూ.2253కు చేరింది. అయితే ప్రస్తుతానికి గృహ అవసరాలకోసం వినియోగించే 14 కిలోల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం కొంత ఊరట కలిగించే అంశం.

- Advertisement -