- Advertisement -
రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కొత్త రికార్డులు సృష్టించింది. ఒక్క మార్చి నెలలోనే రూ.1,501 కోట్ల ఆదాయం రాగా ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ. 12,364 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
2020 – 21లో ప్రభుత్వ ఆదాయం రూ.5,260 కోట్లు ఉండగా ఈ సంవత్సరం మాత్రం రూ.12,364 కోట్లకు పెరిగింది. కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రావడం.. కొత్త విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరగడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది.
వ్యవసాయ భూముల మార్కెట్ విలువ కనీసం 50 శాతానికి, ఖాళీ స్థలాల విలువలను 35 శాతానికి, ఫ్లాట్ల విలువలను 25 శాతానికి సవరించింది ప్రభుత్వం.
- Advertisement -