- Advertisement -
రష్యా – ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా దేశంలో వంటనూనెల ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుండి వంటనూనెను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన భారత్…ఇందులో భాగంగా 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కొనుగోలు చేసింది.
దేశంలో ఏర్పడిన వంటనూనెల కొరతను తగ్గించుకునేందుకు రష్యానుంచి కొనుగోలు తప్పనిసరి అయిందని అందుకే భారీ మొత్తం చెల్లించి దిగుమతి చేసుకున్నామని అధికారులు తెలిపారు. వచ్చే నెలలో భారత్‌లో 12 వేల టన్నుల సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి కానుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు టన్నుకు 1630 డాలర్లు.. భారత కరెన్సీలో రూ. 1.25 లక్షలు చెల్లిస్తే ఇప్పుడు 2,150 డాలర్లు (దాదాపు రూ. 1.65 లక్షలు చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు.
- Advertisement -