టోల్ బాధుడు..!

75
toll
- Advertisement -

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్,డీజీల్,గ్యాస్,నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ చమురు ధరల పెంపుతో హైదరాబాద్‌లో డీజీల్ ధర సెంచరీ దాటగా తాజాగా వాహనదారులకు మరో చేదు వార్త.

జాతీయ రహదారులపై వాహనదారులకు ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల రూపంలో బాదుడు మొదలు కానుంది. కారు, జీపులు వంటి వాహనాలపై 5 నుంచి 10 రూపాయలు, బస్సులు, లారీలకు 15 నుంచి 25 రూపాయలు, భారీ వాహనాలకు 40నుంచి 50 రూపాయల వరకు టోల్ రుసుం పెరగనుంది.

సింగిల్, డబుల్ ట్రిప్లతో పాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై కలిపి 57 టోల్ ప్లాజాలున్నాయి. ఏడాదికి 2వేల 400 కోట్ల రూపాయల టోల్ వసూల్ అవుతుండగా తాజా పెంపుదలతో మరింత పెరగనుంది.

- Advertisement -