టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చరిత్ర తిరగరాస్తోంది. ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ మల్టీస్టారర్ మూవీ మొదిటి రోజే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రూ.223 కోట్ల గ్రాస్ ని కలెక్టర్ చేసిన చిత్రంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది.
తాజాగా సమాచారం ప్రకారం.. ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ వివరాలను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఈ రోజు కూడా అదే ఊపు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇండియన్ సినిమాకు ఈ చిత్రం మరింత ఖ్యాతిని తీసుకొచ్చిందని కొనియాడారు. కరోనా సమయంలో, సెలవులు లేని రోజుల్లో రిలీజైనా… ‘ఆర్ఆర్ఆర్’ తిరుగులేని విధంగా దూసుకుపోతోందని అన్నారు.
ఇక జక్కన్న చెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మాత డీవీవీ దానయ్య రూ. 550 కోట్లతో నిర్మించారు. హై విజువల్స్, యాక్షన్ సిక్వెల్స్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ తమ నటవిశ్వరూపం చూపించారు. వీరిద్దరూ ఉద్యమ వీరులు కొమరం భీం, అల్లూరి సీతారామారాజు పాత్రలు పోషించి ప్రేక్షకుల చేత నీరాజనాలందుకుంటున్నారు.