పల్లకి మోసిన సీఎం కేసీఆర్…

74
kcr cm
- Advertisement -

ఆధ్యాత్మిక శోభతో యాదాద్రి పరిసర ప్రాంతాలు మార్మోగిపోతున్నాయి. మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతుండగా బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌భుత్వ అధికారులు, అర్చ‌కులు, వేద పండితులు పాల్గొన్నారు.

వేద మంత్రోచ్ఛ‌ర‌ణాలు, మేళ‌తాళాల మ‌ధ్య శోభాయాత్ర వైభ‌వంగా సాగగా ప్రధానాలయ పంచతల రాజగోపుర‌రం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు.
దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్‌కు కంక‌ణ‌ధార‌ణ చేసి పండితులు ఆశీర్వ‌చ‌నం అందించారు. 7 గోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు ఏక‌కాలంలో కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు.

- Advertisement -