ఆర్ఆర్ఆర్‌పై సీతక్క ప్రశంసలు..

79
sethakka
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలిరోజు రూ.250 కోట్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్…ఈ వీకెండ్‌లో మరిన్ని వసూళ్లను రాబట్టింది.

తాజాగా ఆర్ఆర్ఆర్ఎ మూవీపై ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. భారతదేశాన్ని విభజించాలనుకుంటే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడండి.. దేశాన్ని ఏకం చేయాలనుకుంటే ‘ఆర్ఆర్ఆర్’ చూడండంటూ కామెంట్స్ చేశారు.

ఆర్ఆర్‌ఆర్ సినిమాకు అన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంచి సినిమా తీశారని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని అభినందించారు.. సోదరులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. సి థియేటర్‌లో రికార్డు చేసిన ‘కొమురం భీముడో.. కొమురం భీముడో..’ సాంగ్‌‌ వీడియోను కూడా సీతక్క ట్వీట్‌కు జత చేశారు.

- Advertisement -