ఎంతో గర్విస్తున్నాం సర్.. ఆర్ఆర్ఆర్‌పై మహేశ్ రియాక్షన్‌..

62
- Advertisement -

ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ రికార్డులను తిరగరాస్తోంది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఓ అద్భుత అంటూ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌పై సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ఈమేరకు తన ట్విట్టర్‌లో ఖాతాలో ఆసక్తికర పోస్ట్‌ చేశారు.

“సినిమాలు ఉంటాయ్… అక్కడే రాజమౌళి సినిమాలంటూ కూడా ఉంటాయ్! ఆర్ఆర్ఆర్ సినిమా ఒక మహోన్నత దృశ్యకావ్యం. ఆ సినిమా భారీతనం, ఘనతర సన్నివేశాలు, సంగీతం, భావోద్వేగాలు ఏమాత్రం ఊహకందనివి. ఊపిరిబిగబట్టేలా చేస్తాయి… ఒక్కమాటలో చెప్పాలంటే మనల్ని కట్టిపడేస్తాయి. ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్ లు చూస్తూ మనల్ని మనం మర్చిపోతాం. ఆర్ఆర్ఆర్ సినిమా అనుభూతిలో మనం కూడా లీనమైపోతాం. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడే ఇలాంటి కథను రక్తి కట్టించగలడు. రాజమౌళి సంచలనాత్మక రీతిలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో గర్విస్తున్నాం సర్!

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గురించి చెపాల్సి వస్తే వారు తమ స్టార్ డమ్ ను మించిపోయారు. వారి నటనా ప్రతిభ ప్రపంచం హద్దులు దాటింది. ‘నాటు నాటు’ పాట చూస్తే భూమ్యాకర్షణ సిద్ధాంతం వట్టిదే అనిపించేలా వారి పెర్ఫార్మెన్స్ ఉంది. సరిగ్గా చెప్పాలంటే వారు గాల్లో తేలిపోతున్నట్టుగా డ్యాన్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ వంటి బృహత్తర చిత్రరాజాన్ని అందించిన యావత్ చిత్రబృందానికి ఈ సందర్భంగా హ్యాట్సాఫ్ చెబుతున్నాను. చాలా చాలా గర్విస్తున్నాను… కంగ్రాచ్యులేషన్స్” అంటూ మహేశ్ బాబు పేర్కొన్నారు.

- Advertisement -