- Advertisement -
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ధోని స్థానంలో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సీఎస్కే కొత్త కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇందుకు సంబంధించి సీఎస్కే ఫ్రాంఛైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ఆటగాడిగా మాత్రం ధోని కొనసాగనున్నాడు.
తాజా నియామకంతో చెన్నై జట్టకు నాయకత్వం వహించబోతున్న మూడో వ్యక్తిగా జడ్డూ నిలిచాడు. గతంలో ధోనీ కాకుండా సురేష్ రైనా మాత్రమే ఈ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. ఐపీఎల్ షురూ అయినప్పటి నుంచి చెన్నై జట్టుకు కెప్టెన్గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ.. తొలిసారి ఈ సీజన్లో కేవలం ఆటగాడిగానే పాల్గొనబోతున్నాడు.
- Advertisement -