- Advertisement -
రఫెల్ నాదల్‌కు షాక్ ఇచ్చాడు యువ ఆటగాడు. ఏటీపీ మాస్టర్స్ 100 విజేతగా అమెరికాకు చెందిన యువ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ నిలిచాడు. నాదల్‌కు షాకిస్తూ విజేతగా నిలిచిన తొలి అమెరికా ఆటగాడిగా నిలిచాడు.
2 గంటల 6 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో అతను 6–3, 7–6 (7/5)తో స్పెయిన్ దిగ్గజంపై సంచలన విజయం సాధించాడు. 2001 (ఆండ్రీ అగస్సీ) తర్వాత సొంతగడ్డపై ఈ టైటిల్ గెలిచిన తొలి అమెరికా ఆటగాడిగా ఫ్రిట్జ్ నిలిచాడు.తాను గెలిచానంటే నమ్మకం కలగడం లేదని, ఇంకా షాక్‌లోనే ఉన్నానని వెల్లడించాడు ఫ్రిట్జ్.
- Advertisement -