వంట నూనెల ధరలు ఆకాశన్నంటాయి. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ఆల్ టైం హైకి చేరాయి. రానున్న రోజుల్లో వంటనూనెలకు తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ నుంచి సప్లై నిలిచిపోవడంతో కొరత ఏర్పడగా రష్యా సప్లై చేసే ఆయిల్ కోసం భారత్, చైనా మధ్య తీవ్ర పోటీనెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల ఎగుమతుల్లో ఉక్రెయిన్ వాటా 23 శాతం కాగా రష్యాది 11 శాతం. వీటిలో ఎక్కువగా దిగుమతి చేసుకునేది భారత్, చైనా దేశాలే. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, కాల్పుల విరమణపై ఇంకా పురోగతి లేదు.దీంతో వంటనూనెలకు తీవ్ర కొరత ఏర్పడనుంది.
2020లో ఉక్రెయిన్ నుంచి భారత్, చైనా మూడు మిలియన్ టన్నుల నూనెలను దిగుమతి చేసుకున్నాయి. వంట నూనెల దిగుమతుల్లో ఉక్రెయిన్‌దే ప్రధాన వాటా కావడం,అక్కడినుండి వచ్చే దిగుమతులకు పుల్ స్టాప్ పడటంతో ఇప్పుడు రష్యా సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఒత్తిడి పెరిగింది.