హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా ‘స్టాండప్ రాహుల్’. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. సిద్దు ముద్ద సమర్పకులు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని హోలీ కానుకగా ఈనెల 18న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ముఖ్యతిథిగా విచ్చేసిన వరుణ్‌తేజ్, దర్శకుడు అనిల్‌రావిపూడితో కలిసి బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు.
అనంతరం వరుణ్ తేజ్ మాట్లాడుతూ, సిద్దు ఈ కథను శాంటో ద్వారా నాకూ వినిపించారు. దర్శకుడిలో చాలా క్లారిటీ వుంది. ట్రైలర్ లో ఆ విషయాన్ని చక్కగా చెప్పాడు. నేను, రాజ్ తరుణ్ ఒకేసారి కెరీర్‌ను మొదలు పెట్టాం. ఇప్పటికీ అలానేవున్నాడు. తను మంచి నటుడు. తన తొలి సినిమాలా వుంది స్టాండప్ రాహుల్. తన కష్టానికి ఫలితం దక్కుతుంది. వర్ష మిడిల్‌క్లాస్ మెలోడీస్ చూశాను. తనకు భవిష్యత్ వుంది. ఇంద్రజ చక్కగా నటించారు. కెమెరా విజువల్స్, సంగీతం బాగా ఆకట్టుకున్నాయి. అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, స్టాండప్ కామెడీ ద్వారా నవ్వించడం కష్టం. ఇందులో కామెడీనేకాదు చాలా అంశాలున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల టైంలో వున్నట్లుగా వున్నాడు. ఇంద్రజగారి సినిమాలు చూశాను. తను మంచి నటి. దర్శకుడు శాంటోకి ఆల్ ది బెస్ట్. ట్రైలర్ లోనే ఏది వుండబోతుందో క్లారిటీగా చెప్పేశాడు. శ్రీకర్ సంగీతం బాగుంది. అందరి కృషికి ఫలితం దక్కుతుందని నమ్మకముంది. ఈ స్టేజీమీద కొందరు స్టాండప్ కామెడీ చేశారు. ఇది చూస్తుంటే నా కాలేజీలో ఓసారి రఘుబాబు చేసిన జోక్ గుర్తుకువస్తుంది. దాన్ని నేను కాలేజీలో స్కిట్ గా చేశాను. అదే నాలో దర్శకుడు వున్నాడనే గుర్తించే లా చేసిందంటూ.. బస్ లో ఓ ప్రయాణీకుడు సీటులో కూర్చోకుండా అటూ ఇటూ నడుస్తూ ఎలా గమ్యానికి చేరాడనేది చెప్పి అందరినీ నవ్వించారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ, నాకు ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా ఇది. అగస్త్య రెండేళ్ళు ఈ సినిమాకే పనిచేశాడు. ఇంద్రజ, మురళీశర్మ, వెన్నెల కిశోర్ మొదలైనవారితో పనిచేయడం గొప్పగా వుంది. ఇందులో నేను బాగా నటించానంటే కారణం వర్ష. దర్శకుడు శాంటోతో పనిచేయడం హ్యాపీగా వుంది. సినిమా మాకు నచ్చింది. మీకూ నచ్చుతుంది. ఫ్యామిలీడ్రామాతో కూడిన రామ్‌కామ్ సినిమా ఇదని` తెలిపారు.
ఇంద్రజ మాట్లాడుతూ, యువతకు కనెక్ట్ అయ్యే విషయాలు ఈ సినిమాలో చాలా వున్నాయి. సహజంగా పెద్దలు పిల్లలను సరైన దారిలో పెడతారు. ఈ సినిమాపరంగా వర్ష, రాజ్ తరుణ్‌ను సరైన దారిలో పెడుతుంది. పెద్దలేకాదు. యూత్‌కూడా ఇప్పుడు సరైన మార్గంలో వెళుతున్నారు. అదేవిధంగా సహజీనం అనే అంశాన్ని చాలా డిటైల్డ్‌గా ఇందులో చెప్పారు. అందుకే యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా చూశాక చాలా విషయాలు తెలుసుకుంటారు. మాకూ పురుషులతోపాటు సమానమైన బలమైన పాత్రలు ఇస్తే చేయగల సత్తావుంది. ఆ దిశగా రాయాలని ఈ సందర్భంగా దర్శకులు, రచయితలకు తెలియజేస్తున్నానని అన్నారు.
దర్శకుడు శాంటో మాట్లాడుతూ, మా ఫ్యామిలీకి సినిమారంగంతో అనుభంలేదు. వారు ఇప్పుడు నన్ను ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇది కామెడీ ఫిలిం అని చేయలేదు. మనం దేన్నైనా సరే ఇష్టపడితే ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం నిలబడాలి, పోరాటం చేయాలని చెప్పే కథ ఈ సినిమా. అందుకే స్టాండప్ కామెడీ నేపథ్యాన్ని ఎంచుకున్నా. రాజ్ తరుణ్ బాగా సహకరించారు. నేను అంతకుముందు షార్ట్ ఫిలింస్ చేశాను. కరోనావల్ల ఇంకా బాగా రాయడానికి సమయం కుదిరింది. వర్ష మంచి నటి. ఈ సినిమాలో చాలా జోక్స్ వర్ష చెప్పినవే. శ్రీరాజ్ విజువల్స్ బాగా చూపించాడు. ఇంద్రజతోపాటు అందరూ బాగా నటించారని అన్నారు.
మార్చి 18న థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేయండని నిర్మాత భరత్ పేర్కొన్నారు. రాజ్ తరుణ్ చూపించే విధానం కొత్తగా వుంటుంది. శాంటో క్లారిటీగా ఈ సినిమా చెప్పాడు. రేపు అందరూ థియేటర్లలో చూసి ఆనందించండి అని మరో నిర్మాత నంద కుమార్ అబ్బినేని అన్నారు.
సమర్పకుడు సిద్దు తెలుపుతూ, ఈ కథ వినగానే నచ్చి భరత్, నందుకు హెల్ప్ చేసేలా చేయగలిగానన్నారు.
వర్ష బొల్లమ్మ తెలుపుతూ, 96లో విజయ్‌సేతుపతితో ఓ సినిమా చేశాను. ప్రేక్షకులకు మంచి సినిమా ఇస్తే వారే మనల్ని తమవారిగా చేసుకుంటారనే కొన్ని విషయాలు ఆయన్నుంచి నేర్చుకున్నాను. ఈ సినిమాలో బాగా నటించానంటే అందుకు కారణం రాజ్ తరుణ్ సహకారమే. దర్శకుడు శాంటోకి కథపై పూర్తి అవగాహన వుంది. ముఖ్య అతిథి వరుణ్ తేజ్‌నుద్దేశించి.. గని చూడ్డానికి మీ మనీ పెట్టుకుని సిద్ధంగా వుండంటూ. ఉత్సాహపరిచారు.
భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె. చంద్ర మాట్లాడుతూ, శాంటో నాకు స్నేహితుడు. అరేబియన్ కాన్సెప్ట్ మీద సినిమా చేయాలంటే బాగా తెలిసివుండాలి. శాంటో దాన్ని బాగా తీశాడనిపిస్తుంది. ట్రైలర్‌లో చూస్తుంటే రాజ్‌తరుణ్ పాత్ర బాగా చేసినట్లుగా వుంది అన్నారు.
గని దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెలుపుతూ, నిన్ననే ఈ సినిమా చూశాను. బాగా వచ్చింది. నిర్మాతలు మంచి సినిమా తీశారు. రాజ్ తరుణ్ టైమింగ్, స్టయిల్ చాలా బాగుంది. ఇంద్రజగారికి మంచి రీఎంట్రీ అవుతుందని ఆశిస్తున్నాన్నా. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇంకా సంగీత దర్శకుడు శ్రీకర్ అగస్తీ, కెమెరామెన్ శ్రీరాజ్ రవీంద్రన్, కొరియోగ్రాఫర్ ఈశ్వర్ మాట్లాడుతూ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అలాగే స్టాండప్ కామెడీ పెర్‌ఫార్మర్స్, రైటర్స్ అయిన రాజశేఖర్, హృదయ్ రంజన్, సందేశ్ తమ స్టాండప్ కామెడీని ప్రదర్శించారు. అనంత్ శ్రీరామ్ రాసిన అలా ఇలా పాటను గాయని సత్య యామిని పాడి అలరించారు. రోల్ రైడా, గీత రచయిత రఘురామ్ కూడా మాట్లాడారు.