- Advertisement -
కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తుండటం అందరిని భయాందోళనకు గురిచేస్తోంది. దక్షిణ చైనాలోని సాంకేతిక కేంద్రమైన షెన్జెన్లో జిన్‌పింగ్ ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో లక్షల మంది జనం ఇండ్లకు పరిమితమయ్యారు.
90లక్షల మంది ప్రజలకు అత్యవసర హెచ్చరికలతో ఇండ్లలోనే ఉండాలని ఆదేశించారు. మరోవైపు దాదాపు 5లక్షల జనాభా ఉన్న షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో కూడా లాక్డౌన్ ఆంక్షలు జారీ చేశారు.
ఇప్పటి వరకు అధికారులు 27వేలకుపైగా కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు. హాంకాంగ్‌లో కొవిడ్-19 కారణంగా మరో 87 మంది మరణించారు. చైనాలో రెండేళ్ల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు చైనాలో శనివారం నమోదయ్యాయి. అవసరమైతే తప్ప ప్రజలు భయటకు రావోద్దని అధికారులకు సూచించారు.
- Advertisement -